స్థానిక సంస్థల ఎన్నికల మూడవ విడత నామినేషన్ల స్వీకరణ చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామపంచాయతీలలో ఈరోజు ప్రారంభమైంది. మందమరి మండలంలోని 10 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 82 వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.