మందమర్రిలో అన్నను రోకలిబండతో కొట్టి చంపిన కేసులో తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మందమర్రికి చెందిన కుమార్, గోపాల్ అన్నదమ్ములు. కుమార్ భార్య చంద్రకళ, గోపాల్ భార్య గంగా వేధింపుల కారణంగా పుట్టింటికి వెళ్లిపోవడంతో కక్ష పెంచుకున్నాడు. డిసెంబర్ 1న గోపాల్ తో గొడవపడి, రోకలి దుడ్డుతో కొట్టడంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు.