మందమర్రి: వన ప్రవేశంతో ముగిసిన పాలవాగు జాతర

మందమర్రి మండలం పాలవాగు వద్ద మూడు రోజులుగా వైభవంగా జరిగిన సమ్మక్క, సారలమ్మ జాతర శనివారం ముగిసింది. చివరి రోజున వనదేవతలు ఆదివాసి సంప్రదాయాల ప్రకారం తిరిగి వనంలోకి ప్రవేశించారు. కోయ పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టింది.

సంబంధిత పోస్ట్