సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని మందమర్రి ఏరియా ఆర్.కె.పి ఓసి వద్ద సింగరేణి జేఏసీ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 44 లేబర్ కోడ్ లను నాలుగు కోడ్ లుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్, ఆలీ వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, పిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.