మందమర్రి పట్టణ మార్కెట్ ఏరియా నుండి భగత్ సింగ్ నగర్, శ్రీపతి నగర్, దీపక్ నగర్, రెండవ జోన్లకు వెళ్లే మెయిన్ రోడ్ కాలనీవాసులకు సౌకర్యార్థం సిమెంట్ రోడ్డు నిర్మించడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఏఐటియూసి నాయకులు తెలిపారు గురువారం వారు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో మందమర్రి జిఎం స్థాయి స్ట్రక్చరల్ మీటింగ్ లో ప్రతిపాదించగా యాజమాన్యం స్పందించినట్లు పేర్కొన్నారు.