మందమర్రి మండలం కేతనపల్లి ఠాకూర్ స్టేడియంలో ఈరోజు అండర్ 1 జూనియర్ గర్ల్స్ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొంటున్నాయి. 27 పోటీల్లో తలపడతాయని, ఈ పోటీలు 12వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించబడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.