మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, బొగ్గు ఉత్పత్తి మరియు ఉత్పాదకత సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని తెలిపారు. మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో ఆయన 19వ స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలకే పరిమితం కాకుండా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.