మందమర్రి: 'ఆటో కార్మిక సేవ సమితి సేవలు అభినందనీయం'

మందమర్రి పట్టణంలోని ఆటో కార్మిక సేవా సమితి సేవలు అభినందనీయమని ఎస్సై రాజశేఖర్ ప్రశంసించారు. మందమర్రి పట్టణానికి చెందిన మేకల శ్రీనివాస్ కాలు విరిగిపోయి జీవనోపాధి లేక అవస్థలు పడుతుండగా గురువారం ఆయనకి 25 కీలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఎస్ఐ అందించారు. ఇప్పటికే సేవాసమితి ఆధ్వర్యంలో గర్భిణీ, దివ్యాంగులకు ఉచిత రెండు ఆటోల ద్వారా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్