ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మందమర్రి పట్టణంలోని కళాశాలలో బాలల భద్రత - మాదకద్రవ్యాల నిర్మూలన అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) పర్స రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువత దేశ భవిష్యత్తు అని, అటువంటి వారు మాదకద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.