రామకృష్ణాపూర్ పట్టణంలోని బి జోన్ శ్రీనివాస్ నగర్ కు చెందిన వృద్ధురాలు రాధ మల్లక్క ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె మెడలో ఉన్న పుస్తెలు తాడు అపహరణకు గురైనట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.