మందమర్రి: 'వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధం'

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని సింగరేణి హాస్పిటల్ సీనియర్ వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ గురువారం పదవీ విరమణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ కు చెందిన అధికారులు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డాక్టర్ ప్రభాకర్ కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ లో వైద్యునిగా 42 సంవత్సరాలు సేవలందించడం జరిగిందని సహకరించిన సింగరేణి ప్రాంత కార్మికులకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్