ప్రభుత్వం అందజేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు పారదర్శకత పాటించి లక్కీ డ్రా ద్వారా అర్హులకు అందజేశామని మందమర్రి తాహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం రామకృష్ణాపూర్ సిఈఆర్ క్లబ్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు అందజేసిన అనుమతి పత్రాలు పొందిన లబ్ధిదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. పాఠశాల విద్యార్థులతో డ్రా చేపట్టారు.