గంజాయి తాగుతూ సింగరేణి ఉద్యోగి పట్టివేత

మంచిర్యాల జిల్లా, చెన్నూర్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీసులు మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు అనుమానిత, నిర్మానుష్య, సున్నిత ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి సేవించి ఉన్న ఒక వ్యక్తిని నార్కోటిక్ డాగ్ చాకచక్యంగా గుర్తించింది. పట్టణంలోని సి హెచ్ పి (CHP) ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ నార్కోటిక్ డాగ్‌కు చిక్కిన వ్యక్తి, భగత్ సింగ్ నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి దానవీన కుమారస్వామిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్