మందమర్రిలో పంటలను అడవి జంతువుల నుంచి రక్షించడానికి పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ అక్రమ విద్యుత్ తీగల వల్ల ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమానిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు, ట్రాన్స్‌కో అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ కనెక్షన్లు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం అనుమతించిన సోలార్ ఫెన్సింగ్, నైలాన్ నెట్లు వంటి సురక్షిత పద్ధతులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.