చెన్నూర్ మండలం కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బాపగౌడ్ ఒక లారీ డ్రైవర్‌ను కొట్టారని ఆరోపిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నాగపూర్ వెళ్తున్న లారీని ఆస్నాద వద్ద అడ్డుకుని డ్రైవర్‌పై దాడి చేశారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ హెచ్చరించారు. గోదాముల్లో ధాన్యం అన్‌లోడ్ చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఈ సంఘటన మరింత సమస్యను సృష్టిస్తోందని పేర్కొన్నారు.