తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే సబ్బండ వర్గాలకు అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జెండాను ఆవిష్కరించి, రాబోయేది కేసీఆర్ పాలనేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.