జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదివారం పరిశీలించారు. సభ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్