జన్నారం: ఎస్బి ఎస్ఐ గంగన్న మృతి

జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఎస్బీ ఎస్సై జాడీ గంగన్న అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 1989లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన ఆయన, 2012లో హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ఏఎస్ఐ గా, సెప్టెంబర్ 28, 2024న ఎస్సైగా పదోన్నతి పొందారు. రెండు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. అనారోగ్యం తిరగబెట్టడంతో కరీంనగర్ లోని ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్