ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాదులోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు అందుబాటులో ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి, సమస్యలను త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.