ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఆమె (TGBKS) గౌరవాధ్యక్షురాలిగా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ బెల్టులో బలమైన పట్టు సాధించారు. కార్మికుల సమస్యలపై పోరాడి, గుర్తింపు సంఘం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం ఆమెకు ఉంది. ఇప్పుడు కొత్త పార్టీ ద్వారా అదే పాత కేడర్‌ను, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గాన్ని మళ్లీ తనవైపు తిప్పుకునే అవకాశం ఉంది.