50% రిజర్వేషన్ల ఎత్తివేతకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలి: బీసీ హక్కుల పోరాట సమితి

మంచిర్యాల పట్టణంలో శనివారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో, జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ల ఎత్తివేతపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 130 రాజ్యాంగ సవరణలు చేసిన ప్రభుత్వాలు, ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం సీలింగ్ రిజర్వేషన్లను రద్దు చేసి, బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్