మంచిర్యాలలో శుక్రవారం జరిగిన బీసీ హక్కుల సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో 50% సీలింగ్ రిజర్వేషన్ల ఎత్తివేతపై బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని శుక్రవారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి కాలయాపన చేయడం సరికాదని, అగ్రకులాలకు EWS పేరుతో 10% రిజర్వేషన్లు కల్పించినట్లే బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, లేనిచో బీసీ ఎంపీలు పార్లమెంట్ ను స్తంభింపజేయాలని, లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.