మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం కెనాల్ పరిసర వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. పెద్దపులి అడుగులు కనిపించడంతో స్థానికుల్లో, రైతుల్లో, గీత కార్మికుల్లో, కాపరుల్లో ఆందోళన నెలకొంది. అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.