మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌పై పలు ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ జల పుష్కరాలలో జల సంచయ్ జన్ భాగిదారీ విభాగంలో జిల్లాకు జాతీయస్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతి వచ్చిందని, అయితే నకిలీ ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ అవార్డు వచ్చిందని, అసలు పని జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు కలెక్టర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి.