ఆదిలాబాద్: పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి: సుగుణక్క

కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని ప‌ని చేస్తున్న ‌వారికి తప్పకుండ పదవులు వస్తాయని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రత్న గార్డెన్ లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తే తప్పకుండ అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్