రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. అహర్నిశలు పార్టీ బలోపేతం కృషి చేస్తున్న కార్యకర్తలకు న్యాయం చేస్తాం అన్నారు.