రక్త దానం చేసిన బీసీ నాయకులు

మంచిర్యాల పట్టణంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జనని వాలంటరి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమం వరకు అనేక పోరాటాలలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని బీసీలుగా స్మరించుకోవాల్సిన భాద్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ సంఘం పెట్టి బీసీల రాజ్యాధికార ఆవశ్యకతను చాటిచెప్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని, కేంద్రం భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕