హనుమాన్ నగర్‌లో పాముకాటుతో ఓ ఆవు మృతి చెందింది. తల్లి మృతదేహం పక్కన దూడ తల్లడిల్లిన తీరు స్థానికులను కలచివేసింది. నిస్వార్థ మాతృప్రేమకు అద్దం పట్టిన ఈ దృశ్యం అందరినీ కదిలించింది. సమాచారం అందుకున్న కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ వెంటనే స్పందించి, ఆవు కళేబరాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.