దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధి ఉట్ల గ్రామం వద్ద అక్రమంగా కలపను తరలిస్తుండగా తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు నేతృత్వంలోని బృందం పట్టుకుంది. కలప తరలిస్తున్న వ్యక్తి బైకును అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ దాడుల్లో సుమారు రూ. 25 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకుని, రేంజ్ కార్యాలయానికి తరలించారు.