దండేపల్లి: ఘనంగా ఆషాడ పౌర్ణమి పూజలు

దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఆషాడ పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఆసరా పనులు పురస్కరించుకొని గురువారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే దేవాలయంలోని మండపంలో సుమారు 105 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయి. భక్తులకు దేవాలయ అధికారులు, దాతలు తీర్థ ప్రసాదం, పులిహోర, అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్