దండేపల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనుల్లో ఆలస్యం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం కంట్రోల్ ప్యానెల్ బిగింపు పనుల్లో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, పనులు ముందుగానే చేపడితే యాసంగికి నీటిని విడుదల చేసేవారని పేర్కొన్నారు. సంక్రాంతికి ముందే సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్