దండేపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ ఏఈ

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణాలను హౌసింగ్ ఏఈ ఇలియాస్ పరిశీలించారు. శుక్రవారం తాళ్లపేట గ్రామంలో బేస్ మెంట్ లెవెల్ లో పూర్తి చేసిన మొదటి లబ్దిదారు దుర్గం రజిత రవీందర్ ఇంటి నిర్మాణాన్ని కొలత చేసి, మొదటి విడత బేస్‌మెంట్ లెవల్ బిల్ లక్ష రూపాయల మంజూరు కొరకు రికార్డు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి సతన్న, కారోబార్ శ్రీనివాస్, తాళ్లపేట ఎంపీటీసీ కంది సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ అడాయి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్