దండేపల్లి: వినూత్నంగా విద్యాబోధన

దండేపల్లి మండలంలోని గుడి రేవు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వినూత్న రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులలో సైన్స్ పై ఆసక్తిని పెంచేందుకు మంగళవారం పాఠశాల ఆవరణలో టీ షర్టులపై మానవ అవయవాలను గుర్తించి మానవ శరీర నిర్మాణం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం బుచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంచడంతో పాటు పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్