దండేపల్లి: వడదెబ్బతో కూలీ మృతి

దండేపల్లి మండలంలోని జైతుగూడకు చెందిన ఆత్రం రాజేష్ (50) వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు. రాజేష్ ఓ ఇంటి వద్ద కూలీపనికి వెళ్ళగా, ఎండ తీవ్రతతో అక్కడే వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అస్వస్థతకు గురై, లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్