దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆటస్థలం కోసం మైదానాన్ని చదును చేయిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతిరోజూ ఆటల పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో ఉన్న మైదానాన్ని దాతల సహకారంతో బ్లేడ్ బండి సహాయంతో శుక్రవారం చదును చేయించామని పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం దాతలు సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు.