మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి బావిలో పడేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డిసిపి భాస్కర్ తెలిపారు. ప్రధాన నిందితులైన శనిగారపు బాపు, సతీష్ లు గత నెల 24న బాలికను ఇంటి పరిసరాలల్లో చింతచెట్టు కింద ఆడుకుంటుండగా నోరు మూసి చేను లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నులిమి బావిలో పడేసి పారిపోయినట్లు డిసిపి తెలిపారు.