మంగళవారం తెల్లవారుజాము నుంచి దండేపల్లి మండలంలోని నాగసముద్రం, తాళ్లపేట, ముకాష్ గూడా, గుడి రేవు, దమ్మన్నపేట, పెద్దపేట, ద్వారక, ధర్మారావుపేట గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనికి తోడు చల్లని గాలులు వీస్తుండటంతో చిన్నారులు, అస్తమారోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు చలికి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.