ఘనంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాత్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, దేశ సమగ్రత, ఏకత కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. "ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు చెల్లవు" అని ఆయన గళమెత్తారని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్