బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీకి చెందిన 65 ఏళ్ల మొగిలి వడదెబ్బతో మృతి చెందారు. జనహిత సేవాసమితి సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులకు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. దుఃఖంలోనూ, వారు ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంగీకరించారు. వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు ఆధ్వర్యంలో మొగిలి కంటి కార్నియాలను సేకరించారు. మరణించిన తర్వాత కూడా ఇద్దరికి చూపునిచ్చిన మొగిలి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.