మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్‌కు చెందిన కె. శ్రీనివాస్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితిని గమనించిన స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లగా, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ₹5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేసింది. మంగళవారం జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ బాధిత కుటుంబ సభ్యులకు ఈ ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.