మంచిర్యాల అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఫైటర్‌గా పనిచేస్తున్న రాజేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకానికి ఎంపిక చేసింది. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన అగ్నిమాపక సేవల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అనేక సందర్భాల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారు. ఇటీవల ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పడంలో ఆయన విశేష కృషి చేశారు.