స్నేహితుడి జ్ఞాపకార్థం అన్నదానం: వెంకటేష్ కు ఘన నివాళి

జన్నారం మండల కేంద్రంలోని దేవుని కూడా గ్రామానికి చెందిన వెంకటేష్, 30 జనవరి 2024న ఇరాక్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం, వెంకటేష్ చదువుకున్న ప్రాథమిక పాఠశాలలో అతని స్నేహితుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు షఫీక్, గోవింద్ నాయక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ స్నేహితులు గణేష్, కృష్ణ, అనిల్, సతీష్, మనోహర్, నాని, గణేష్, రాకేష్, సిద్ధూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్