మంచిర్యాల పట్టణంలో బుధవారం తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగాదేవి బోనాల జాతర ఘనంగా జరిగింది. పట్టణ పుర వీధుల గుండా ఊరేగింపుగా బోనాలు తీసి గోదావరి నది ఒడ్డున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులు నగదు బదిలీ పథకం ప్రవేశ పెట్టాలని, నామినేటెడ్ పదవుల్లో గంగపుత్రులకు సమాన అవకాశాలు కల్పించాలని, వృత్తి చేస్తూ చనిపోయిన మాత్స్య కారులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేసీయా చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.