హాజీపూర్, లక్షట్టిపెట్ మండలాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం హాజీపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ముంపు బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రగా రతహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.