హాజీపూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

హాజీపూర్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11: 30 గంటల వరకు హాజీపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్, దొనబండ, పెద్దంపేట, కర్ణమామిడి, పడ్తనపల్లి, టీకనపల్లి, రాంపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

సంబంధిత పోస్ట్