హాజీపూర్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం హాజీపూర్ మండలంలోని నమ్నూర్ గ్రామంలో ఉన్న జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వైరల్ జ్వరాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో సురక్షితమైన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, హెచ్ఈఓ రఘుపతి, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్