ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నాటికి ప్రాజెక్ట్ నీటిమట్టం 18.500 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 1.55 లక్షల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 50 వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు 276 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ద్వారా గోదావరిలోకి భారీగా నీరు చేరుతోంది.