గిరిజన గ్రామంలో జన్ మన్ వైద్య శిబిరం

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం కొత్తపేట రాయికుంట గిరిజన గ్రామంలో శుక్రవారం పీఎం జన్ మన్ పథకం కింద వైద్య శిబిరం నిర్వహించారు. మారుమూల ఆదివాసీలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సర్పంచ్ దినేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి బీంరావ్, ఉప సర్పంచ్ సుకదేవి, డాక్టర్ ఆదిత్య బాబు, గౌతమి, కీర్తన, ప్రశాంత్, మౌనిక, సుజాత తదితరులు గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్