జన్నారం: 'అటవీ ఆంక్షలు ఎత్తివేయాలి'

కవ్వాల్ అభయారణ్యంలో అటవీ ఆంక్షలు ఎత్తివేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని జన్నారం మండల అభివృద్ధి కమిటీ నాయకులు కోరారు. సోమవారం కమిటీ మండల అధ్యక్షుడు శ్రీరామోజి కొండయ్య ఆధ్వర్యంలో సభ్యులు, మహిళలు స్థానిక తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. భారీ వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని, టైగర్ జోన్ ను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్