జన్నారం: అగ్ని ప్రమాదంలో గడ్డి దగ్ధం

జన్నారం మండలం పొనకల్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ముడతల రాజన్నకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పారు. అప్పటికే గడ్డి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 10,000 నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్